Sampangi songs and lyrics
Top Ten Lyrics
Gundenenduki Chaavura Lyrics
Writer :
Singer :
Gundenendukichavura devuda
Yendamaavi chesavuraa devuda
Amruthamantee premanu kuripisthavu
Maru nimushamlo vishamuga marigisthavu
Gundenendukichavura devuda
Manasu manasutho mudivesi mouna prematho penvesi
Okarinokarigaa thodunu chesthavu
Okari needalo okarini chusthavu
Valapu deepalu veliginchi
Vela vennelalu kuripinchi
Kalala kaalaanni kariginchesthavu
Silaku pranalu nuvve posthavu
Aadinanthasepadukoni bommalanni visiresthavu
Uha theliyani pasipaapai bommarillu thannesthavu
Yemaya theliyani pasi hrudayaalanu thalo dikkuga visirikodathavu
Gundenendukichavura devuda
Yedanu gudilaaga maarchesi
Yeduta devathanu chupinchi
Prema pujale jaripinchesthavu
Vintha maayalo padadosesthavu
Brathuku haarathiga veliginchi
Vethala paathralo kariginhi
Velugu rekhalanu niluvuna kosthavu
Viluva cheekatiga migilinchesthavu
Nindu pranalu kadilipothunte kanne neetitho kaalchevu
Bandaraayilaa nuvvuntavu kanukane baadhapadalevu
Ee maayalanni ika neeke thelusani manishini pattuku vedhisthavu
Gundenendukichavura devuda
Yendamaavi chesavuraa devuda
Amruthamantee premanu kuripisthavu
Maru nimushamlo vishamuga marigisthavu
Gundenendukichavura devuda
గుండెనెందుకిచ్చావురా దేవుడా
ఎండమావి చేశావురా దేవుడా
అమృతమంటీ ప్రేమను కురిపిస్తావూ
మరు నిముషం లో విషముగ మరిగిస్తావూ
గుండెనెందుకిచ్చావురా దేవుడా
మనసు మనసుతో ముడివేసి
మౌన ప్రేమతో పెనవేసి
ఒకరినొకరిగా తోడును చేస్తావూ
ఒకరి నీడలో ఒకరిని చూస్తావూ
వలపు దీపాలు వెలిగించి
వేల వెన్నెలలు కురిపించీ
కలల కాలాన్ని కరిగించేస్తావూ
శిలకు ప్రాణాలు నువ్వే పోస్తావూ
ఆడినంతసేపాడుకునీ బొమ్మలన్ని విసిరేస్తావు
ఊహ తెలియనీ పసిపాపై బొమ్మరిల్లు తన్నేస్తావు
ఏమాయ తెలియనీ పసి హృదయాలను తలో దిక్కుగా విసిరికొడతావు
గుండెనెందుకిచ్చావురా దేవుడా
ఎదను గుడిలాగ మార్చేసి
ఎదుట దేవతను చూపించి
ప్రేమ పూజలే జరిపించేస్తావూ
వింత మాయలో పడదోసేస్తావూ
బ్రతుకు హారతిగ వెలిగించి
వెతల పాత్రలో కరిగించి
వెలుగు రేఖలను నిలువున కోస్తావూ
విలువ చీకటిగ మిగిలించేస్తావూ
నిండు ప్రాణాలు కదిలిపోతుంటె కన్నె నీటితో కాల్చేవు
బండరాయిలా నువ్వుంటావూ కనుకనే బాధపడలేవు
ఈ మాయలన్ని ఇక నీకే తలుసని మనిషిని పట్టుకు వేధిస్తావు
గుండెనెందుకిచ్చావురా దేవుడా
ఎండమావి చేశావురా దేవుడా
అమృతమంటీ ప్రేమను కురిపిస్తావూ
మరు నిముషం లో విషముగ మరిగిస్తావూ
గుండెనెందుకిచ్చావురా ఓ దేవుడా
How to use
In Junolyrics, This box contains the lyrics of Songs .If you like the lyrics, Please leave your comments and share here . Easily you can get the lyrics of the same movie. click here to find out more Lyrics.