Pavurama Pavurama Lyrics

Writer :

Singer :




పావురమా పావురమా మనబ్రతుకే పంజరమా
కన్నులలో కాపురమా...అందని ఓ..గోపురమా
పావురమా పావురమా మనబ్రతుకే పంజరమా

వెన్నెల్లో మల్లేపూలా మంచెం వేసీ ఉంచానూ...
అందాలా మందారాలా గంధాలెన్నో దాచానూ...
కళ్ళల్లో వత్తులు వేసీ నీకై వేచీ ఉన్నానూ..
వెచ్చన్నీ కౌగిళ్ళల్లో ఒకటైపోదామన్నానూ...
వెన్నెలె పామై కరచిన వేళా..
కన్నుల ఆశా కరిగిన వేళా..
జాలైనా లేనే లేదా రానే రాదా నీకింకా
ఈ బాధా తీరేదెట్టా నీవే చెప్పూ నాకింకా

పావురమా పావురమా మనబ్రతుకే పంజరమా
కన్నులలో కాపురమా...అందని ఓ..గోపురమా
పావురమా పావురమా మనబ్రతుకే పంజరమా

ఎన్నాళ్ళీ ఉపవాసాలూ ఎన్నేళ్ళమ్మా వనవాసం...
శివరాత్రీ రాకుండానే చేస్తున్నానే జాగారం...
ఆకుందీ వక్కా ఉందీ రెండూ కలిసేదేనాడూ...
పరువాలా తాంబూలంతో పెదవులు పండేదేనాడూ...
నెమ్మది లేనీ తుమ్మెద గోలా
తుమ్మెద రానీ పువ్వుల జ్వాలా
ఎన్నెన్నో కలలే కన్నా నిన్నా నేడూ నీకోసం
మౌనంగా ఏడుస్తున్నా నాలో నేనే మనకోసం

పావురమా పావురమా మనబ్రతుకే పంజరమా
కన్నులలో కాపురమా...అందని ఓ..గోపురమా
పావురమా పావురమా మనబ్రతుకే పంజరమా

Music Director Wise   Film Wise


How to use

In Junolyrics, This box contains the lyrics of Songs .If you like the lyrics, Please leave your comments and share here . Easily you can get the lyrics of the same movie. click here to find out more Lyrics.