Varasudochhadu songs and lyrics
Top Ten Lyrics
Nee Andam Lyrics
Writer :
Singer :
Nee andam naa prema geetha govindam
Nee varnam naa keeravani sanketam
Nee raagam ye prema veena sangeetam
Ee yogam ye jeeva dhara sangeetam
Vayyari roopam gandhara shilapam
Sringara deepam veligisthe
Nee choopu konam sandimchu baanam
Naa letha pranam registhe
Nee andam naa prema geetha govindam
Ee yogam ye jeeva dhara samyogam
Joradu kuchhilla paradu padhala
Parani vedalu ghamkinchaga
Koradu meesala tharadu mosala
Naamanda heesaalu chamakinchaga
Aararu ruthuvullo allaru muddullo
Eda janta thallalu vinipindhaga
Aashada meghala aavesha geethalu
Sarikothha bhavalu savarinchaga
Neekosame eeduu nenuu veychamule
Neekosame naalo nanne dahanule
Ninu pilichanu malisande peranta
Ika modalaye podarinti poraatam aaraatam
Nee andam naa prema geetha govindam
Ee yogam ye jeeva dhara samyogam
Hamsalle vachhindi himsalle gichhindi
Nee navvu naa puvvu vikasinchaga
Maatalle vachhindi manasedo vippindi
Vaddanna nee maata valapinchaga
Reppallo kochhindi repalle kaalindi
Naa nuvvu nee nenu kridinchaga
Gadhallo nidloya radhamma lechindi
Naa venuve naaku vinipinchaga
Nee pinchame kilakinthapaalu chesindile
Naa kosame ee parijatham poosindile
Mana madiyalalo prema thaarangam
Swara brundhaviharala chindeti anandam
Nee ragam ye prema veenam sangeetham
Ee yogam ye jeeva dhara samyogam
Vayyari roopam gandhara shilapam
Sringara deepam veligisthe
Nee choopu konam sandimchu baanam
Naa letha pranam vedisthe
Nee andam naa prema geetha govindam
Ee yogam ye jeeva dhara samyogam
Telugu
నీ అందం నా ప్రేమ గీతా గోవిందం
నీ వర్ణం నా కీరవాణీ సంకేతం
నీ రాగం ఏ ప్రేమావీణా సంకేతం
ఈ యోగం ఏ జీవధార సమ్యోగం
వయ్యారి రూపం గాంధార శిల్పం
శృంగార దీపం వెలిగిస్తే
నీ చూపుకోణం సంధించు బాణం
నా లేత ప్రాణం వేధిస్తే
నీ అందం నా ప్రేమ గీతా గోవిందం
ఈ యోగం ఏ జీవధార సమ్యోగం
జీరాడు కుచ్చిళ్ళ పారాడు పాదాల
పారాణీ వేదాలు ఘమకించగా
కోరాడు మీసాల తారాడు మోసాల
నామంద హాసాలు చమకించగా
ఆరారు ఋతువుల్లో అల్లారు ముద్దుల్లొ
ఎద జంట తాళాలు వినిపించగా
ఆశాఢ మేఘాల ఆవేశగీతాలు
సరికొత్త భావాలు సవరించగా
నీకోసమే ఈడూ నేనూ వేచాములే
నీకోసమే నాలో నన్నే దాచానులే
నిను పిలిచానూ మలిసందె పేరంటం
ఇక మొదలాయె పొదరింటి పోరాటం ఆరాటం
నీ అందం నా ప్రేమ గీతా గోవిందం
ఈ యోగం ఏ జీవధార సమ్యోగం
హంసల్లే వచ్చింది హింసల్లే గిచ్చింది
నీ నవ్వు నా పువ్వు వికసించగా
మాటల్లె వచ్చింది మనసేదో విప్పింది
వద్దన్న నీ మాట వలపించగా
రెప్పల్లొకొచ్చింది రేపల్లె కాలింది
నా నువ్వు నీ నేను క్రీడించగా
గాథల్లొ నిదరోయి రాధమ్మ లేచింది
నా వేణువే నాకు వినిపించగా
నీ పించమే కిలకింతపాలూ చేసిందిలే
నా కోసమే ఈ పారిజాతం పూసిందిలే
మన మదియాలలో ప్రేమ తారంగం
స్వర బృందావిహారాల చిందేటి ఆనందం
నీ రాగం ఏ ప్రేమావీణా సంకేతం
ఈ యోగం ఏ జీవధార సమ్యోగం
వయ్యారి రూపం గాంధార శిల్పం
శృంగార దీపం వెలిగిస్తే
నీ చూపుకోణం సంధించు బాణం
నా లేత ప్రాణం వేధిస్తే
నీ అందం నా ప్రేమ గీతా గోవిందం
ఈ యోగం ఏ జీవధార సమ్యోగం
How to use
In Junolyrics, This box contains the lyrics of Songs .If you like the lyrics, Please leave your comments and share here . Easily you can get the lyrics of the same movie. click here to find out more Lyrics.